తెలంగాణ ఉద్యమ కళాకారులకు నంది అవార్డు..
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్:
శుక్రవారం తెలంగాణ ఉద్యమ కారుల ఐక్యవేదిక అధ్యక్షులు బుల్లెట్ వెంకన్న ఆధ్వర్యంలో ఆరుట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమ కలకారులకు సన్మానం నంది అవార్డులు ప్రధానము చేశారు. తెలంగాణ ఉద్యమములో కలకారులు తమ పాటల కల ద్వారా తెలంగాణ ప్రజలను ఒక్క తాటిమీదికి తీసుకారాగలిగారు కలకారుల పాత్ర ఉద్యమానికి ఊపిరి పోశారు. అలాంటి కాలకారులను తెలంగాణ ఏర్పడ్డ ఇన్ని సంవత్సరాలకు తెలంగాణ ఉద్యమ కారుల ఐక్యవేదిక తెలంగాణ రాష్టములో ఎంతోమంది కలకారులు కృషి చేయగా వారిలో 100 మందిని కలకారులను గుర్తించి వారికి సన్మానం చేసి నంది అవార్డులు ప్రధానము చేశారు. వారిలో మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడూర్ కు చెందిన పంజారబోయిన శ్రీనివాస్ ను గుర్తించి శ్రీనివాస్ కు సన్మానం చేసి నంది అవార్డు ప్రధానము చేశారు. ఈకార్యక్రమంలో ఘనపురం శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గద్దర్ విమలక్క ఏపూరిసోమన్న నేర్నాల కిషోర్ దరువు అంజన్నలు పాల్గొన్నారు.