ఇంకెన్నాళ్ల వరకూ ఈ నిర్లక్ష్యం?

Get real time updates directly on you device, subscribe now.

ప్రత్యేక కథనం

హ్యూమన్ రైట్స్ టుడే /హైదరాబాద్ /డిసెంబర్ 07: మంచి పాఠశాల అంటే అందమైన తరగతి గదులతోపాటు, అవసరమైనన్ని మరుగుదొడ్లు కూడా ఉండాలి. అయితే, చాలావరకు బడులు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యకు తగినంతగా మరుగుదొడ్లు లేనందున, పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

దేశీయంగా పన్నెండు వేల ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు లేవని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్నా నీటి వసతి లేక పోవడంతో వృథాగా మారాయి. సర్కారీ బడుల్లో 1.40 లక్షల టాయి లెట్లు నిర్మించామని చెబుతున్నా, చాలా చోట్ల అవి కనిపించవని, అర కొరగా నిర్మితమయ్యాయని లేదా నిరుపయోగంగా మారాయని కాగ్ పరిశీలన నాలుగేళ్ల క్రితం కుండ బద్దలుకొట్టింది. ఈ దుస్థితి అమ్మాయిలకు శాపంగా మారుతోంది. చాలా బడుల్లో విద్యార్థులు మరుగుదొడ్ల ముందు బారులు తీరిన దృశ్యాలు తరచూ మీడియాలో కనిపిస్తుంటాయి.*స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు న్నర దశాబ్దాలు దాటినా, మన పాఠశాలల తీరు మారని దైన్యాన్ని అవి కళ్లకు కడతాయి.* సంక్షేమ వసతిగృహాల నిబంధనల మేరకు ప్రతి 25 మంది విద్యార్థినులకు మూడు స్నానపుగదులు, నాలుగు మరుగు దొడ్లు ఉండాలి. లేదంటే పది మందికి ఒక స్నానపు గది, ఏడుగురికి ఒక మరుగుదొడ్డి ఉండాలి.

తెలంగాణలోని 20 గురుకులాలపై ఇటీవల ఓ సామాజికవేత్త చేపట్టిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. 15.138 మంది విద్యార్థులకు 1513 స్నానపు గదులు ఉండాల్సి ఉండగా, 870 మాత్రమే ఏర్పాటయ్యాయి. 2,162 మరుగుదొడ్లకు గాను 1104 మాత్రమే ఉన్నాయి. ఈ కొరతపై హైకోర్టు స్పందిస్తూ.. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా బుచ్చి రెడ్డి పాళెం మండలం ఉన్నత పాఠశాలలో సుమారు వెయ్యి మంది విద్యార్థినులకు ఒక్కటే మరుగుదొడ్డి, నాలుగు మూత్రశాలలే ఉన్నాయి.
మూత్రవిసర్జనకు బాలురు బయటికి వెళ్తున్నారు. అమ్మాయిలు. అసహాయ పరిస్థితుల్లో దాహం వేసినా నీరు తాగడంలేదు. ఏపీలోని 352 కస్తూర్బా విద్యాలయాల్లో 6-10వ తరగతి చదువు తున్న విద్యార్ధినుల సంఖ్య అరవై వేలకు పైమాటే. ఇంటర్ విద్య అందిస్తున్నవి 221 ఉండగా.. దాదాపు 15 వేల మంది వాటిలో ఉన్నారు. ఆ విద్యాలయాల్లో కనీస వసతుల్లేక పిల్లలు నానా అవస్థలూ పడుతున్నారు. ఇంటర్ విద్యార్ధినులకు వసతితో పాటు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం ఒక్కోటి రూ. 1.10 కోట్ల వ్యయంతో 101 భవనాలు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 90 భవనాల నిర్మాణాన్నీ ప్రారంభించారు.
గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకో వడంవల్ల బాలికలు, ఉపాధ్యాయినులు అనా రోగ్యం పాలవుతున్నారు. మూత్రాన్ని చాలా సేపు ఆపుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తలెత్తే ప్రమాదం ఉంది. క బ్యాక్టీరియా సైతం వృద్ధి చెందుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.

చట్టానికి విఘాతం..

ప్రతి బడికి దృఢమైన భవంతి, తగిన సిబ్బంది, ప్రహరీ, గ్రంథాలయం, తాగునీరు, క్రీడాసామగ్రి, మరుగుదొడ్లు వంటి సౌకర్యా లన్నీ ఉండితీరాలని విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తోంది. బాలికల ‘గౌరవప్రద జీవనా నికే విద్యాహక్కు చట్టం దోహదం చేస్తుందని సర్వోన్నత న్యాయ స్థానం అభిలషించింది. కానీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు నెల కొన్నాయి. మరుగుదొడ్లు, వాటిలో నీటి సౌకర్యం లేకపోవడం. వల్ల చాలామంది విద్యార్ధులు అర్ధాంతరంగా బడికి దూరమవుతు న్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి కైనా ప్రభుత్వాలు స్పందించి అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, వాటిలో నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే విద్యా ర్థుల ఇక్కట్లు తీరి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు పడేది.

హరిప్రసాద్ దూపాటి

సామాజిక ఉద్యమకారుడు, సీనియర్ టీచింగ్ ఫ్యాకల్టీ, సమాచార హక్కు పరిరక్షణ కర్త

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment