హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/డిసెంబర్ 06: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో, నిన్న సాయంత్రం 25 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి.
కుటుంబీకులు చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కాలనీ వాసులు మండిపడ్డారు.