ప్రొఫెసర్ డాక్టర్ చెంగయ్యపై దాడిని కండిద్ధాం:

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /హైదరాబాద్/డిసెంబర్ 05: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో ఆచార్యులుగా/ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అణగారిన వర్గాల, నిమ్నజాతి ముద్దుబిడ్డ డాక్టర్ చెంగయ్యని మత ప్రచార నెపంతో కొందరు రౌడిమూకలు, అజ్ఞానులు, మూర్ఖులు సంఘవ్యతిరేక శక్తులు, దుర్మార్గపు శక్తులు, అంధకార శక్తులు అన్యాయపు శక్తులు, అహంకారపు శక్తులు అకారణంగా, అన్యాయంగా అతని ఛాంబర్ లోకి బలవంతంగా చొరబడి.. దౌర్జన్యం చేయడం, దుర్భాషలాడడం, భౌతికదాడికి దిగడం, పాల్పడడం అతని వాహనాన్ని సైతం ధ్వంసం చేయడం మొత్తంగా సమాజాన్నే భయబ్రాంతులకు గురిచేయడం నిజంగా సిగ్గుచేటు. సభ్యసమాజం తలదించుకునే చర్య.
ఈ అనైతిక, అనాగరిక, అప్రజాస్వామిక మూర్ఖపు చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా/పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఇంతకూ మనం ప్రజాస్వామ్యంలోనే వున్నామా? అన్న అనుమానం కలుగుతోంది.
మనది మత రాజ్యాంగం కాదు లౌకిక రాజ్యాంగం అన్న సంగతి, స్పృహా, అవగాహన, అలోచన మరచి ఇలా ఉన్మాదంతో రెచ్చిపోవడం ఎంతవరకు సమంజసం? తన టేబుల్ పై “నా దేశం, నా మతం మరియు నా దేవుడు” అన్న పుస్తకం కనకడితేనే మత ప్రచారం చేసినట్లా? అటువంటి పుస్తకం తన టేబుల్ పై వుంచుకొనే, చదువుకొనే స్వేచ్ఛ ఈ దేశంలో లేదా? యిటువంటి వాళ్లపై ప్రభుత్వాలు ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా, చూసీ చూడనట్లు వ్యవహరిస్తే “ప్రభుత్వం – పౌర సమాజం” భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన గురుతర భాధ్యత ప్రాతినిధ్య మరియు జవాబుదారీ ప్రభుత్వం/Representetive and Responsible Government (RRG) పై వుంటుందని అది మరిస్తే ఎవరైనా పాలకుడిగా అనర్హులకిందకు వస్తారని ఇటువంటి అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచన చేస్తున్నాం మరియు విజ్ఞప్తి కూడా చేస్తున్నాం.

రండి.. బరితెగించి ఇష్టారాజ్యంగా నడుచుకునే, వ్యవహరించే అల్లరి మూకలకు తగినబుద్ధి, గుణపాఠం చెపుదాం, నేర్పుదాం.. సమాజం శాంతి, సామరస్యం, సుహృద్భావం మరియు సోదరభావంతో వర్ధిల్లెలా ప్రయత్నిద్దాం.. సంఘం, సమాజం పట్ల బాధ్యతలేని దుర్మార్గులను ఒక ఆట ఆడుకుందాం.. “ప్రభుత్వం – పౌర సమాజం “వెంటనే ప్రత్యేక చొరవతీసుకుని.. ఇరువంటి ఘటనల పట్ల అప్రమత్తంగా వుండేలా మన భాధ్యతలు, కర్తవ్యాలను సక్రమంగా, అంతఃకరణ శుద్ధితో నెరవేర్చుదాం….

సంగటి మనోహర్ మహాజన్,
వ్యవస్థాపక చైర్మన్,
SOUTH INDIA MEDIA,
(మన మీడియా, మన ప్రాంతం):
వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త మరియు ఉద్యమ నిర్మాత, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/CONSTITUTIONAL RIGHTS PROTECTION COMMITTEE (CRPC);
(రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం):
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,
మహాజన రాజ్యం పార్టీ/
MAHAJANA RAJYAM PARTY (MRP);
(మన ఓటు, మన రాజ్యం):
కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా -9849509416.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment