రైలు నుంచి దూకేసిన యువతి
మెడిసిన్ సీటు దక్కలేదనే..
హ్యూమన్ రైట్స్ టుడే/అనంతపురం/క్రైం/డిసెంబర్ 04: రాయదుర్గం శివారులో రైలు నుంచి దూకి తనూజ (20) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
మెడికల్ సీటు రాలేదనే మనస్తాపంతోనే యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటకలోని సేడంకు చెందిన ఆమె చిత్రదుర్గలో చదువుతున్నారు. మెడికల్ సీటు రాకపోవడంతో ఇక తాను బతకలేనని తల్లిదండ్రులకు చెప్పారు. నిన్న సొంతూరికి వెళ్తూ రాయదుర్గం వద్ద రైలు నుంచి దూకి చనిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.