హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: అటు ఉరుముతున్న ఆర్థికమాంద్యం.. ఇటు పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో… ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని ₹5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారి కూడా భారీ వెసులుబాటైతే ఉండకపోవచ్చు కానీ.. కొద్దోగొప్పో మార్పులు జరగొచ్చన్న వాదన వినిపిస్తోంది. మధ్యతరగతిని ఆకట్టుకోవటానికి.. ముఖ్యంగా తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి.