హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/నవంబర్ 26: మన దేశానిది ప్రగతిశీల ప్రజాస్వామ్యం అని రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26కు 75 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రాజ్యాంగ ప్రతిని సంస్కృతంలోని మైథిలి భాషలో విడుదల చేశారు. పార్లమెంటు హాలులో సభ్యలును ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగం దేశానికి, దేశ ప్రజలకు ఎంతో పవిత్రమైనదన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్ వంటి వారు దేశానికి సమర్ధవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.