నిజామాబాద్ జిల్లా నుంచే వికలాంగుల రాజ్యాధికార సాధన పోరాటం కొనసాగుతుంది. చట్టసభల్లో వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై అన్ని రాజకీయ పార్టీలు వాటి వైఖరిని స్పష్టం చేయాలి. 75 ఏండ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తారో ప్రధాన పార్టీల అధ్యక్షులు అయిన కెసిఆర్ రేవంత్ బండి సంజయ్ లు స్వష్టం చేయాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా నుంచే వికలాంగుల రాజ్యాధికార సాధన పోరాటం కొనసాగుతుందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చింతం జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమైన వికలాంగుల సామాజిక వర్గానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తూందో స్వష్టం చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అయిన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు ప్రధాన జాతీయ పార్టీల రాష్ట్ర శాఖ అధ్యక్షులు అయిన రేవంత్ రెడ్డి బండి సంజయ్ లు వారి పార్టీల వైఖరిని స్వష్టం చేయాలని చట్టసభల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ దక్కేంతవరకు దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై తమ పోరాటం కొనసాగుతుందని 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమైన ఏకైక సామాజిక వర్గం ఒక్క వికలాంగుల సామాజిక వర్గమేనని ఏండ్ల నుంచి సకలాంగుల పాలకుల చేత అణిచివేతకు గురై ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొంటు దుబ్బర జీవితాలు గడుపుతున్న తమ బతుకులు మారాలంటే గల్లి నుంచి ఢిల్లీ వరకు రాజ్యాధికారం దక్కించుకోవాల్సిందేనని ఆ దిశగానే దేశంలోని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ కమిటీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుబ్బర జీవితాలు గడుతున్న వికలాంగుల సంక్షేమం కోసం దళిత బంధు మాదరి గానే 15 లక్షల రూపాయలతో వికలాంగుల బందు పథకాన్ని తీసుకురావాలనీ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనూ వికలాంగుల సంక్షేమానికి 1000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని వికలాంగుల సమాజానికి ప్రభుత్వ ప్రవేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందించాలని ఇల్లు లేని వికలాంగుల అందరికీ తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోను వికలాంగులకు వందకు వందశాతం రిజర్వేషన్ కల్పించి పెన్షన్ వచ్చే ప్రతి వికలాంగుడికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చింతం జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షుడు నాయికిడి పోశెట్టి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి బరిడే శ్రీనివాస్ విద్యార్థి సంఘం నాయకులు ఏన్నరాజు జక్కలువాడు శ్రీకాంత్ షేక్ అబ్దుల్లా బద్దుల పోతన్న ఏడ కొట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.