ఏపీలో ఈ నెల 25 నుంచి సేవలు నిలిపివేస్తాం: 108 సిబ్బంది
హ్యూమన్ రైట్స్ టుడే/ అమరావతి/ నవంబర్ 15: ఏపీలో 108 వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 25 నుంచి సేవలు నిలిపి వేస్తామని 108 ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలిపారు.
మేము పడుతున్న సమస్యల పై ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర 108 సంఘ నేతలు మహేష్, మునిరాజ, రాజేష్, సునీల్, కేశవులు, సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.