తప్పుడు ప్రచారం వద్దు.. మండలిలో హోమ్ మినిస్టర్ ఉగ్రరూపం
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/నవంబర్ 15: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేయ వద్దని వైసీపీ ఎమ్మెల్సీలకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుధు కళ్యాణి మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్లు రెండు ఎగ్గొట్టారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం అమలు చేస్తు్న పథకాలపై తప్పుడు ప్రచారం చేయవద్దంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత్ సూచించారు. అలాగే తమ ప్రభుత్వం ఈ పథకాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారనే విషయాన్ని సైతం ఆమె సోదాహరణగా వివరించారు.