మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..

Get real time updates directly on you device, subscribe now.

జర్నలిస్టుల సమస్యలపై పోరాటం..

వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి..

మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..

మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/నవంబర్ 14:
👉రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు ఇళ్లపట్టాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోవు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జర్నలిస్టులందరూ సహకరించాలని మచ్చా రామలింగారెడ్డి APWJU రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చారు

👉 అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి పాల్గొని లాంచనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి రవి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో విజయరాజు, జానీ, షాకీర్,  లోకరాజు, సాయినాథ్ రెడ్డి, ఇతర జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు

👉 ఈ సందర్భంగా ముఖ్యఅతిథి రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని ఇందుకోసం కొత్త జీవోను విడుదల చేయాలని నిబంధనలు సడలించి యూట్యూబ్ ఛానల్స్ చిన్న పత్రికలు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టులకు ఇవ్వాలని కోరారు

👉 అన్ని కులాల మాదిరిగానే జర్నలిస్టులను ప్రత్యేకంగా గుర్తించి జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి జర్నలిస్టు కుటుంబాలకు, పిల్లలకు ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు మహిళలకు లోన్ల సౌకర్యం కల్పించాలని కోరారు  ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు జీవో విడుదల చేయాలని అన్నారు

👉 వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఉచిత విద్యను అన్ని కార్పరేట్ స్కూల్లో అందజేయాలని ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు

👉 రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యంగా జర్నలిస్టుల సమస్యల కోసం అందర్నీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తామని జర్నలిస్టులందరూ సహకరించాలని మచ్చా కోరారు
 
👉 అనంతపురం జిల్లాలో వచ్చే నెల మొదటి వారంలో సభ్యత్వ నమోదు అనంతరం జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించి నూతనంగా కమిటీని ఏర్పాటు చేస్తామని మచ్చా అన్నారు

👉 సమావేశ అనంతరం జర్నలిస్టులకు సభ్యత్వం రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రాజు, రమేష్, జి.శ్రీధర్, మొహమ్మద్ రఫీ, త్యాగరాజు, తిరుపతయ్య దినేష్, ఉపేంద్ర, విజయ్, సాయికుమార్, జె.నాగరాజు, జి.రాము  పెద్ద ఎత్తున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చిన్న పత్రికలు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు
_________________________

*APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా శాఖ*

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment