ఎన్యుమరైటర్ల పై అధిక పని భారం సరికాదు: ఉపాధ్యాయుల ఆవేదన
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 14:
తెలంగాణ రాష్ట్రంలోసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలు పెట్టిన 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఇందుకోసం దాదాపు 90 వేల మంది సిబ్బంది అవసరం ఉండగా ఈ మేరకు విద్యా శాఖల నుంచి మాత్రమే ఎక్కువ సిబ్బందిని తీసుకున్నట్లు ఆరోపణ. దీంతో కుల గణన సర్వేలో రోజువారి టార్గెట్ తో తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని, ఉపాధ్యాయ నాయకులు ఆరోపిస్తు న్నారు.
ఒక్కో ఇంటికి సుమారు 40 నిమిషాలపై చిలుకు సమయం పడుతున్నందున రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించినా,15 కుటుంబాలు సర్వే పూర్తి చేయడం సాధ్యం కావడంలేదని, 8 నుంచి 10 కుటుంబాల సర్వేనే సాధ్యం అవుతుందని, ఇది అధికారుల సర్వేలో కూడా వాళ్ళు గ్రహించిన వాస్తవమని, వారు పేర్కొన్నారు.
చలికాలం కావడంతో తొందరగా చీకటి అవుతున్నందున మహిళా ఎన్యుమరేటర్లు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని సాధక బాధాకాలని కూడా పరిశీలించాలని వారు పేర్కొన్నారు.
ప్రాథమిక పాఠశాలల నుండి మాత్రమే ఎన్యుమరేటర్ల ను తీసుకోవడం పట్ల ఇటు విద్యార్థులు చదువు విషయంలో నష్టపోతున్నారని, ఈ కుల గణన సర్వేలో మరి కొంతమంది సిబ్బందిని తీసుకుంటే కొంత పని భారం తగ్గే అవకాశం ఉందని, దీనితోపాటు స్వల్ప వ్యవధిలోనే కుల గణన సర్వే పూర్తి చేయగలిగే అవకాశం ఉందని, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.