భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారంగా పీసా చట్టాన్ని అమలు చేయాలని..

Get real time updates directly on you device, subscribe now.

కోయ పూర్బమ్ సదస్సును విజయవంతం చేయండి – ఆదివాసి సంక్షేమ పరిషత్ , రాష్ట్ర అధ్యక్షుడు బంగారు.వెంకటేశ్వర్లు

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /అల్లూరి సీతారామరాజు జిల్లా/చింతూరు మండలం/నవంబర్ 10: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఆదివారం స్థానిక సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్లో ఏర్పాటు చేసిన ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసి నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ప్రత్యేకమైన చట్టాలను తయారు చేసి శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అలానే భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారంగా పీసా చట్టాన్ని అమలు చేయాలని అలానే ఆదివాసుల గ్రామ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ పెద్దలు, పూజలు, ఏపార్లు వ్యవస్థకు, హిందూ, ముస్లిం, క్రైస్తవుల మత పెద్దలకు ఇచ్చే గౌరవ వేతనం షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా వీరికి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వలన ఆదివాసీ కోయ, కొండ రెడ్డి తెగల సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అలవాట్లు ఆచారాలను కనుమరుగవుతున్నాయి. కాబట్టి వారికి మెరుకైన ప్యాకేజీని కల్పించి పునరవాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత ప్రతి కుటుంబానికి అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్యాకేజీని పోలవరం ప్రాజెక్టులో అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని పీసా చట్టం అమాలు చేయాలని ప్రభుత్వానికి కోరారు. బిర్సా ముండ జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఆదివాసి గ్రామ పెద్దల సమావేశం చదలవాడ, గూడూరు, కొత్తపల్లి, మోతు గూడెం పంచాయతీలకు చెందిన గ్రామ పెద్దలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెo చిన్న వీరభద్ర, శీలం కృష్ణ, పులి వీరయ్య, తుమ్మల దుర్గా రెడ్డి, సోడి రాఘవయ్య, సోడి ప్రసాద్, లక్ష్మణరావు, మినప నాగేశ్వరావు, రవ్వ  ప్రసాద్, గొంది లక్ష్మన్, కుంజా శ్రీను, కారం సంకూరమ్మ, సోడి సత్యవతి, సోడి బాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

నవతరంగ్ ప్రతినిధి : ప్రసాద్

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment