హ్యూమన్ రైట్స్ టుడే/రామగుండం:
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. కొంతమంది పసుపు, కుంకుమలతోపాటు జంతుబలి చేశారు. భయానక వాతావరణం సృష్టించారు. ఇటీవల కాలంలో కార్పొరేషన్ లోని ఓ కాంట్రాక్టర్ మృతి చెందడంతో అతని ఆత్మను శాంతింప చేయడానికి క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు క్షుద్ర పూజలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.