*మద్దిశెట్టి సామేలుకు ఆర్పిఐ (అతావలె) పార్టీకి ఎటువంటి సంబంధం లేదు*
*పోడు భూముల వ్యవహారంలో పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ వాటా ఎంత* ?
*రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా* (అతవలె)
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరేనీ శ్రావణ్ కుమార్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 వ తారీఖున తలపెట్టిన బహుజన రాజ్యాధికార సభ కు మద్దిశెట్టి సామేలు ప్రమాణ స్వీకారంకు ఎలాంటి సంబంధం లేదని బహుజనుల ఐక్యతను చాటి చెప్పటం కోసమే హైదరాబాద్ లో సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ అన్నారు. మద్దిశెట్టి శ్యాముల్ కి ఆర్ పి ఐ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అతని పై ఉన్న క్రిమినల్ కేసుల నుండి బయట పడేందుకే ఆర్ పి ఐ పార్టీని అడ్డుపెట్టుకొనే కుట్ర జరుగుతోందని అన్నారు. మద్దిశెట్టి శ్యాముల్ పై క్రిమినల్ కేసు నమోదు అవుతుందని ముందుగా తెలుసుకున్న పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ అతని అనుచరులు హుటాహుటిగా 28- 1- 2023 శనివారం రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పార్టీ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా అనధికారకంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పత్రికలో వచ్చిన సమాచారం పై దళిత బహుజన గిరిజన నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ వేసి బాధితులకు అండగా నిలబడతమని అన్నారు. పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ అక్రమాలకు పాలడుతున్నట్లు డబ్బులు తీసుకొని కేసులను నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని ఇప్పటికే అతనిపై చాలా ఆరోపణలు ఉన్నాయని పార్టీలో ఎస్సి లను అనగద్రొక్కి కుట్ర చేస్తూ మాల – మాదిగల మధ్య గొడవలు సృష్టిస్తూ దళితులను గిరిజనులను భయపెట్టి, మభ్యపెట్టి వారిని ఆర్థికంగా రాజకీయంగా అణగదొక్కాలని పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ చెస్తున్నట్లు ఇప్పటికే పేరం పై జాతీయ కమిటికీ. సౌత్ ఇండియా కమిటీకి పిర్యాదు చేయడం జరిగిందని పేరం – మద్ది శెట్టి. వీరిరువురు వీరి అనుచరులు ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో వారి అనుచరులను పెట్టుకొని రాష్ట్ర కమిటీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేయడం ప్రెస్ మిట్ నిర్వహించారు అని చెప్పారు. పోడు భూములుపట్టాల వ్యవహారంలో పేరం శివనాగేశ్వర రావు గౌడ్ వాటా ఎంతో టీసులుస్తామని బాధితులను ఆర్పిఐ పార్టీ రాష్ట్ర కమిటీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటుంది అని ప్రకటించారు. ఈ విషయంలో సదరు పేరo శివ నాగేశ్వరరావు గౌడ్ మీద కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పార్టీ తరపున కోరుతున్నాం, కావున ఇట్టి విషయాలను జాతీయ అధ్యక్షులైన మరియు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రివర్యులైన శ్రీ రామ్‌దాస్ (అతవలె)కి ఫిర్యాదు చేయడము జరుగుతుంద ని తెలియచేశారు.