పల్నాడు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ పిల్లలకు ఫీజు రాయితీ కు సంబంధించిన ఆర్డర్స్ జారీ..
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీనీ కల్పించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కు కృతజ్ఞతలు తెలియజేసిన “ఎన్ఎఆర్ఎ”
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ అసోసియేషన్ (NARA) చేసిన కృషికి దక్కిన ఫలితం..
హ్యూమన్ రైట్స్ టుడే/నరసరావుపేట/ అక్టోబర్ 23: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీనీ పల్నాడు జిల్లా వ్యాప్తంగా అమలు జరిగేలా చూడాలని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో స్పందించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్ ఫీజు రాయితీకి సంబంధించిన ఆర్డర్స్ను జారీ చేశారు.
ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ అసోసియేషన్ (NARA) మరియు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఐఏఎస్ కు, జిల్లా విద్యాశాఖ అధికారికి కృతజ్ఞతలు తెలియజేశారు.