బస్టాండ్ సమస్యను వెంటనే పరిష్కరించండి

Get real time updates directly on you device, subscribe now.

ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి- వై.యస్.ఆర్.సి.పి.ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/అనకాపల్లి జిల్లా/గొలుగొండ మండలం/అక్టోబర్ 22: ఏ.ఎల్.పురం మేజర్ పంచాయతీ ఆర్.టి.సి కాంప్లెక్స్ లోని నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతామని డిపో మేనజర్ యమ్.యస్. దీరజ్ కి మెమోరాండం ద్వారా తెలియ పరిచిన గ్రామ సర్పంచ్ మరియు అనకాపల్లి జిల్లా వై.యస్.ఆర్.సి.పి.ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల.సుజాత ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గతములో ఒక మంచి ఉద్దేశముతో గ్రామ పంచాయతీ నుండి సుమారు 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఆర్.టి.సి కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారని కానీ కాంప్లెక్స్ ఆవరణములో ఆర్.టి.సి యాజమాన్యం షాపులు నిర్మించి స్వ ప్రయోజనాలు చూసుకొంటుంది గాని ప్రయానికుల సౌకర్యలను పట్టించుకోవడం లేదని అలాగే ప్లాట్ ఫామ్ నిర్మాణం లేక ప్రయాణికులు ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారని డిపో మేనేజర్ వారి దృష్టికి తీసుకొని వెళ్ళమని వారు సానుకూలంగా స్పందించారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గొల్తి తాతజీ, కర్రి ప్రకాష్ రావు, కాళ్ళ సత్తి బాబు, కర్రి నరసియ్య మరియు మహిళలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment