ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు విడుదల : లోకేశ్
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /అమరావతి/ అక్టోబర్ 22: ఏపీలో సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు ₹8.63cr
కేజీబీవీ లకు ₹35.16cr, మండల రిసోర్స్ కేంద్రాలకు ₹8.82cr, మిగతా స్కూళ్లకు ₹51.90cr నిధులు ఇచ్చారు. సుద్ద ముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, తాగునీటి కోసం ఈ నిధులను పాఠశాల ఉపాధ్యాయులు యాజమాన్యం వాడాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.