హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /నిర్మల్/ అక్టోబర్ 20: నిర్మల్ జిల్లాలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగించారని కోఆర్డినేటర్ తెలిపారు. నిర్మల్ లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ (బి. ఎ/బీకాం/ బీఎస్సీ) కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు గడువు అక్టోబర్ 30 వరకు పొడిగించినట్లు అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ డా.యు.గంగాధర్, ప్రిన్సిపాల్ డా. ఎం. సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మొబైల్ నెం 7382929703 ను సంప్రదించగలరు అన్నారు.