ఇల్లందులో జర్నలిస్టు సుదర్శన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: మానసాని కృష్ణారెడ్డి – డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు
దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..
డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 19: ఇల్లందులో ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్టు సుదర్శన్ పై జరిగిన దాడి హేయమైన చర్య దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు మోటపలుకుల వెంకట్ తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మద్య వారధిగా ఉంటూ నిస్వార్ధ సేవ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు, హత్యాహత్నాలు, అక్రమ కేసులు పెట్టడం లాంటి చర్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని జర్నలిస్టుల భద్రత కోసం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నోట్: ఇల్లందులో జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ డిజెఎఫ్ పక్షాణ జిల్లా, మండల కేంద్రాలలో నిరసిన కార్యక్రమం నిర్వహించండి.
మానసాని కృష్ణారెడ్డి
డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు
మోటపలుకుల వెంకట్
డిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.