హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 19: సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.
ఇటీవల కాలంలో పరిస్థితులన్నీ పూర్తిగా మారి పోయాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖాతాదారుడికి ఖచ్చితంగా ఆధార్, పాన్ కార్డు ఉండి తీరాలి. అలా అయితేనే బ్యాంక్‌లో ఖాతా తెరుస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతాల్లో వివిధ రకాలు ఉన్నాయి. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ తదితర రకాలున్నాయి. కానీ చాలా మంది సేవింగ్ అకౌంట్లనే ఒపెన్ చేస్తారు.
అత్యధిక శాతం ఖాతాదారులు తాము సంపాదించిన నగదును ఈ ఖాతాల్లోనే పొదుపు చేస్తుంటారు. ఈ సేవింగ్ అకౌంట్లలో నగదు భద్రపరచడమే కాకుండా దీనిపై వడ్డీని సైతం పొందవచ్చు. మరికొన్ని సమయాల్లో ఇతరుల నగదును తమ ఖాతాల ద్వారా ఖాతాదారుడు లావాదేవీలు జరుపుతుంటాడు.