మారని పేరెంట్స్….?, మైనర్లకు బండ్లు ఇస్తు ఏకంగా స్కూల్ కే పంపిస్తున్న పరిస్థితి..
ద్విచక్ర వాహనంపై స్కూల్ విద్యార్థులు…?
స్కూల్ యాజమాన్యం కూడా చూసి చూడనట్లు వదిలేస్తుంది..?
పోలీసులు ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చిన.., ఎన్ని కేసులు నమోదు చేసిన మారని కొందరి తీరు..?
స్కూల్ యాజమాన్యం అసలు పట్టించుకునే స్థితిలో లేదు..?
వరంగల్ ట్రాఫిక్ పోలీసులు స్పందించి సదరు ద్విచక్ర వాహన యజమానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ…
హ్యూమన్ రైట్స్ టుడే/ అమరావతి/ అక్టోబర్ 19: కాశీబుగ్గ శ్రీ చైతన్య స్కూల్లో 9వ తరగతి చదివే విద్యార్థి స్కూల్ కు, ద్విచక్ర వాహనం మీద రోజు స్కూల్ కు వస్తుంటాడు. అదే విధంగా శుక్రవారం సాయంత్రం స్కూల్ అయిపోయాక బండి నడుపుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనంను ఢీకొన్న పరిస్థితి బాలుడిని ఆపి పేరెంట్స్ కు జరిగిన సంఘటనపై వారికి ఫోన్ ద్వారా తెలియచేస్తే, మా బాబుకు డ్రైవింగ్ వచ్చు, మీరు ఎవరు అడగటానికి? అంటూ పేరెంట్స్ నిర్లక్ష్యపు సమాధానం. ఈ బండి మీద కేసు నమోదు చేయాలని, సదరు పేరెంట్స్ ను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తే కానీ, మున్ముందు మరో ఘటన జరగకుండా ట్రాఫిక్ పోలీసులు చొరవ తీసుకోవాలని కోరుతూ ఈ విన్నపం..!