హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 19:
ఆంధ్రప్రదేశ్ లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై కీలక ప్రకటనలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఐదారు నెలల్లో పూర్తి చేస్తామని DGP ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. న్యాయ పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా ఈ పోస్టులకు గత ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206 మంది అర్హత సాధించారు. అయితే హోంగార్డులకు సివిల్, ఏ ఆర్ పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు.