హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 16: హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ, కార్యాలయంలో బుధవారం మామిడి భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో, world food day కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఆహారం, దాని ప్రాముఖ్యత గురించి, ఆహారాన్ని వృధా చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆహారం వృధా చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి, పోషకాలు కలిగిన ఆహారం గురించి, ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. వినియోగదారులను చైతన్యం చేయడంలో ఆహార అవసరాల గురించి తెలియజేయడంలో, రెడ్ క్రాస్ సొసైటీ ముందు ఉంటుందని భీమ్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (CATCO) అధ్యక్షులు శంకర్ లాల్ చౌరసియా, సంయుక్త కార్యదర్శి విశ్వధర్ రాజు, మహిళ సంయుక్త కార్యదర్శి శిల్పా రెడ్డి, కార్యవర్గ సభ్యురాలు హరిప్రియ రెడ్డి, స్వర్ణ రెడ్డి, తదితరులు పాల్గొని ప్రసంగించినారు. ఈ సందర్భంగా ఆహార దినోత్సవ పోస్టర్ను విడుదల చేయడం జరిగినది.