హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 16: వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం రేపల్లె నుంచి చీరాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు కర్ల పాలెంకి దగ్గరలో ఉన్న ముకుంద టీ స్టాల్ వద్దకు రాగానే బస్సు నడుపుతున్న డ్రైవర్ కు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో చాకచక్యంతో బస్సును పొలాల్లో మళ్లించారు. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దింపేలోపే డ్రైవర్ డి.సాంబశివరావు, గుండె పోటుతో మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.