హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 16: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది, డియర్ నెస్ అలవెన్స్, మూడు శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. కాగా కేంద్రం దీపావళి పండుగ కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈమేరకు త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇందుకు సంబంధించి అంశాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు సైతం వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు సంబంధించి చర్చించారని, క్యాబినెట్ ఇందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఈరోజు సాయంత్రం లోగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో లక్షల మందికి పైగా ఉద్యోగులకు పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది.