హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్ర ప్రదేశ్ /తిరుపతి/అక్టోబర్ 15: తిరుపతి కాట్పాడి రైల్వే ట్రాక్ డబుల్ లైన్ నూతన ప్రాజెక్ట్ అమలులో భాగంగా తిరుపతి జిల్లాలో తిరుపతి నుండి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్ 45 కి.మీ లు చేపట్టడానికి అధికారులు భూసేకరణ చేస్తున్నారు. పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్ పరిధిలో సుమారు 37 ఎకరాల భూసేకరణ చేపట్టడానికి చర్యలు చేపట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వేస్, సికింద్రాబాద్ వారు వర్చువల్ విధానంలో మంగళవారం పాల్గొని సూచించారు. భూసేకరణ మేరకు చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టర్ తో పాటు జెసి శుభం బన్సల్ కూడా వారితో పాటు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ జి – సెక్షన్ డిటి భాస్కర్ పాల్గొన్నారు.