సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన కుటమి ప్రభుత్వం నాయకులు..
పాకలపాడులో పల్లె పండుగ..!!
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/అనకాపల్లి జిల్లా/గొలుగొండ మండలం/అక్టోబర్ 15: పల్లె పండుగ కార్యక్రమంలో బాగంగా పాకలపాడు గ్రామ పంచాయతీ కూటమి ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో సిసి రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో 14వ తారీకు నుంచి 20వ తారీకు వరకు పల్లె పండుగ కార్యక్రమం చేపట్టాలని ఆదేశాల జారీచేశారు. ఈ మేరకు గ్రామంలో 10 లక్షల రుపాయలు నిధులతో సిసి రోడ్డుకు శంకు స్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందని కుటమి సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాకలపాడు మాజీ సర్పంచ్ కామిరెడ్డి రామన్న, సీనియర్ నాయకుడు బొడ్డు సత్యనారాయణ, ఎల్లవరం గ్రామ సర్పంచ్ కొల్లు రాంబాబు, రావణాపల్లి సర్పంచ్ కొల్లు సత్యనారాయణ, ఏటిగైరంపేట సర్పంచ్ బిడిజాన రామకృష్ణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు కర్రి నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కొల్లు గోవింద, కసిమి టీడీపీ నాయకుడు బాబురావు, గుండుపాల మాజీ సర్పంచ్ గుమ్మడి చిన్నబ్బాయి, గుండుపాల మాజీ ఎంపీటీసీ రవివర్మ, నల్లబెల్లి స్వామి, అల్లు స్వామి మరియు మండల నాయకులు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి