హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/ అల్లూరి సీతారామరాజు జిల్లా / చింతూరు మండలం/అక్టోబర్ 14: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామంలోని సోడి లచ్చమ్మ నివాసం ఉంటున్న ఇల్లు అయిన పురిగుడిసె ప్రమాదశాత్తుగా కాలిపోవడం జరిగింది. మధ్యాహ్న సమయం కావడంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పి ఇంట్లో వస్తువులు పూర్తిగా కాలి పోవడం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఈ ఘటనకు సంబంధించి కారణాలు తెలుసుకోవాలని, అలాగే నివాసం కోల్పోయిన సోడి లచ్చమ్మ కు కాలిపోయిన గృహానికి నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను కోరడం జరిగింది.
నవతరంగ్ ప్రతినిధి : ప్రసాద్