ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

Get real time updates directly on you device, subscribe now.

“అక్టోబర్ 14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం”

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ అక్టోబర్ 14: ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా వివిధ వస్తువులు సేవల నాణ్యత ప్రమాణాలను పెంపొందించడం కోసం జరుపుకోవడం జరుగుతుంది. అందులోని భాగంగా మన భారతదేశంలో భారత ప్రభుత్వ సవస్త బి.ఐ.ఎస్ (BIS) పరిశ్రమలు ఉత్పత్తి చేసే అటువంటి వస్తువులు, సరుకులను, రసాయనాలు మొదలుకొని, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, యంత్రాలు, సిమెంటు, ఇనుము, వెండి బంగారు నగలు, మరియు గృహ ఉపకరణాలు అయినటువంటి స్టవ్లు, కుక్కర్లు, ఓవెన్లు, ఫ్రిజ్జులు, ఏసీలు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, తదితరాలు ఉత్పత్తి చేసే అటువంటి సంస్థలు తమ యొక్క ఉత్పత్తులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ప్రయోగశాలకు పంపించి వారి యొక్క ఉత్పత్తుల స్వచ్ఛత ప్రమాణాలను సూచించి సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వారు జారీ చేసినటువంటి సర్టిఫికెట్ యందు వారి యొక్క వస్తువు ఒక కోడ్ నెంబర్ను జారీ చేయడం జరుగుతుంది.

వినియోగదారులు సైతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క గుర్తులు చూసి కొనుగోలు చేయడం జరుగుతుంది. అందువల్ల బి.ఐ.ఎస్ సర్టిఫికెట్ పొందినటువంటి పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు మంచి పేరుతో పాటు వారి ఉత్పత్తులు ఎక్కడికైనా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వినియోగదారులకు సైతం నాణ్యమైనటువంటి వస్తువులు, సరుకులు, పొందే అవకాశం దొరుకుతుంది.

https://www.bis.gov.in/hybo/

అందుకు ప్రభుత్వం కూడా నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడం కోసం భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వినియోగదారులను పారిశ్రామికవేత్తలను చైతన్య పరచడం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది. పారిశ్రామికవేత్తలతో మరియు వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో వినియోగదారులతో కలిసి చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ హైదరాబాద్ వారు శ్రీ చైతన్య కార్యక్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క ప్రాముఖ్యత మరియు ఏ విధంగా మనం కొనుగోలు చేసేటువంటి వస్తువులు, సరుకులు తనకి చేసుకోవాలా ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలా విధంగా పారిశ్రామికవేత్తలు సైతం బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ (BIS) యొక్క సర్టిఫికెట్ ఏ విధంగా పొందాల, దానివల్ల పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయంపై వివరించడం జరుగుతుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment