జల వనరుల పరిరక్షణ యాత్రకు సంఘీభావం

Get real time updates directly on you device, subscribe now.

చెరువుల్లో కబ్జాలు తొలగించాల్సిందే…!

దేవుడి బందలో నిరసన తెలియజేసిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి..

జల వనరుల పరిరక్షణ యాత్రకు సంఘీభావం తెలిపిన సమితి జిల్లా ప్రతినిధులు..

హ్యూమన్ రైట్స్ టుడే ప్రతినిధి/ఆంధ్రప్రదేశ్/ మన్యం పార్వతిపురం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల్లో కబ్జాలను తొలగించాల్సిందేనని ఉత్తరాంధ్ర చర్యలు పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు అన్నారు. ఆదివారం పార్వతీపురం పట్టణంలోని కబ్జాకు గురైన దేవుడి బందలో ఆ సమితి అధికార ప్రతినిధి సిగడాం భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేజేటి దయామణి, జిల్లా ఉపాధ్యక్షులు వండాన నేతాజీ, రాష్ట్ర కార్యదర్శి మండల పకీరు నాయుడు తదితరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు జాగారపు ఈశ్వర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు చక్రవర్తి చేపట్టిన జల వనరుల పరిరక్షణ యాత్రకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన బిజెపి నాయకులు మరిసెల్ రామా రావుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో గల పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో కబ్జాకు గురైన చెరువులను ఎమ్మెల్యేలు మంత్రులు రక్షించాలన్నారు. కబ్జాలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే తాము కబ్జాకు గురైన చెరువుల డాక్యుమెంట్లను సిద్ధం చేశామన్నారు. భావితరాలకు తాగు సాగునీరు అందివ్వడంతోపాటు పర్యావరణాన్ని కాపాడటం, భూగర్భ జలాలను రక్షించడం, జంతు జలజీవరాసులు, పశుపక్ష్యాదులు ఉనికికి నిలయమైన జలవనులను రక్షించేందుకు న్యాయస్థానానికి వెళ్తామన్నారు. పార్వతీపురంలో బిళ్ళబంద, దేవుడి బంధ, కోదువాని బంధ, నిల్లిచెరువు, గోప సాగరం, లక్ష్మనాయుడు చెరువు, కొత్తవలసలోని పలు చెరువులు కబ్జాకు గురయ్యాయన్నారు. రక్షించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలన్నారు. కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. కబ్జా సమయంలో పనిచేసిన అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. జల వనరుల పరిరక్షణ యాత్రలో పిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ నీటి వనరులు కనుమరుగైతే భవిష్యత్తు ఏ విధంగా అంధకారం అవుతుందో వివరించనున్నామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో యాత్రను నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. మేధావులు, సామాజిక స్పృహ కలిగిన వారు, ప్రకృతి ప్రేమికులు, సంఘ సంస్కర్తలు ముందుకొచ్చి ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి చేపడుతున్న జల వనరుల పరిక్షణ యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment