ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పలు శంకుస్థాపనలు..!

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 13: దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండా రెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

☑️గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.

☑️రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.

☑️రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.

☑️రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

☑️రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

☑️రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

☑️రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.

☑️ముఖ్యమంత్రి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment