ఐఏఎస్ కాట ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లను ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్‌కు కేటాయింపు.
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు వెంటనే స్వరాష్ట్రం (ఏపీ) లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 10: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లతో పాటు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు వెంటనే స్వరాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేశారు అని సంభదిత అధికారుల సమాచారం. ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం నిన్న (9వ తేదీన) పంపించింది అని వెల్లడించారు.
ఏపీ క్యాడర్ అధికారుల వివరాలు…
1. వాకాటి కరుణ, ఐఏఎస్, 2004
2. రోనాల్డ్ రాస్, ఐఏఎస్, 2006
3. వాణీప్రసాద్, ఐఏఎస్, 1995
4. ఆమ్రపాలి కాట, ఐఏఎస్, 2010
5. ప్రశాంతి, నవంబర్ రిటైర్, 2009
1. అంజన్ కుమార్, ఐపీఎస్, 1990
2. అభిలాష బిస్త్, ఐపీఎస్, 1994
3. అభిషేక్ మహంతి, ఐపీఎస్, 2011