తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 09: ట్యాంక్ బండ్ పై 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు సి.ఎస్. శాంతి కుమారి ప్రకటించారు. రేపు 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులుతో మాట్లాడుతూ రేపు 10వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారు.
బతుకమ్మలతో పాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఈ సందర్భంగా, బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ నుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ల ప్రదర్శన ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.