పండుగలకు 6,304 ప్రత్యేక బస్సులు

Get real time updates directly on you device, subscribe now.

బతుకమ్మ, దసరా పండుగలకు 6,304 ప్రత్యేక బస్సులు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 07: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్ చెప్పింది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గతేడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment