హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 07: చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. నగరంలో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా ఓ యాప్‌ను తీసుకురానుంది. ఎక్కడ ఆక్రమణలు జరుగుతున్నా యాప్ ద్వారా సమాచారం క్షణాల్లో హైడ్రాకు చేరేలా చర్యలు చేపట్టింది. ఈ యాప్‌లోనే ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం, క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన, చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.