హ్యూమన్ రైట్స్ టుడే/కామారెడ్డి జిల్లా/అక్టోబర్ 06: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం DSP ధర్మాసమాజ్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ BC/SC/ST ప్రజలందరి కష్టాలు కన్నీళ్లు తుడవటానికి జిల్లాలోని అభాగ్యులందరికి అండగా ఉండి వారిని సమన్వయ పరచటానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అనంతరం కామారెడ్డి జిల్లాకి ఇంచార్జ్ గా లక్ష్మణ్ మహారాజ్ ని నియమించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ బోలేశ్వర్, కో కన్వీనర్ లు అరవింద్, రాజు జిల్లా కమిటీ సభ్యులు పర్శరాములు, గంగరాజు, సాయి, సత్యం, లక్ష్మణ్, రాజశేఖర్, నితిన్, కవిన్, అనిల్, రాజు, రాంచంద్రం, పోచన్న మిగితా ముఖ్యులు పాల్గొన్నారు.