హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం: రిటైర్డ్ ఆర్మీకి ఖమ్మం టేకులపల్లి కేసీఆర్ టవర్స్ లో ఘన సన్మానం దక్కింది. అంబటి బాబుజీ గుంటూరు జిల్లా రేపల్లె గ్రామానికి చెందివాడు. ఆయన 20 సంవత్సరాలు ఆర్మీ జవాన్ గా భారత దేశసరిహద్దులైన కాశ్మీర్, కన్యాకుమారి సరిహద్దుల్లో దేశరక్షణ కోసం పోరాడి రిటైర్డ్ అయ్యారు. వారు ఖమ్మం నివాసస్థలముగా ఏర్పరచుకొని జీవిస్తున్న సమయములో తెలంగాణా గవర్నమెంట్ వారిని గుర్తించి వారికి ఖమ్మలో టేకులపల్లిలో ప్రభుత్వముచే నిర్మించిన రెండు పడకల ఇండ్లలో వారికి కూడా ఒక ఇంటిని మంజూరు చేయడం జరిగింది. 26 రిపబ్లిక్డే సందర్భముగా వారిని గుర్తించి ఖమ్మం టౌన్ BRS పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు మరియు KCR టవర్స్ BRS పార్టీ కార్యకర్తలు, అబ్దుల్ రహీం, బండి శివ, సాదిక్, అనిల్, అన్వర్, పాస్టర్ ఆదాం, రడం సురేష్, హర్షద్, రమేష్, భాషి, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇంచార్జెస్, వారికి ఘన సన్మానం చేశారు.