పెళ్లి సందడి.. ఈ సీజన్లో 48 లక్షల పెళ్లిళ్లు!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 05: రెండు నెలల విరామం తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవనుంది. 45 రోజుల పాటు సాగే ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. వీటికోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు భారతీయులు సిద్ధం అవుతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సర్వే పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగనుందని తెలిపింది.