ఆర్మూర్ పట్టణ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలో అపశృతి నెలకొంది.
హ్యూమన్ రైట్స్ టుడే/ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో జెండా ఆవిష్కరణలో అపశృతి నెలకొంది.జెండా తలకిందులుగా ఆవిష్కరణ జరిగిన సంఘటన ఎమ్మెల్యే క్యాంపులో చోటుచేసుకుంది.
ఆర్మూర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పూజా నరేంద్ర ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్ త్రివర్ణ పథకాన్ని తలకిందులుగా ఆవిష్కరించారు.వెంటనే కార్యక్రమంలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు జెండా తలకిందులుగా ఉన్న విషయాన్ని చెప్పడంతో కిందికి దించి సరి చేశారు. ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంతోనే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా తలకిందుల సంఘటన తలెత్తిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత,పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.