బతుకమ్మకు కవిత దూరమేనా?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 05: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా బతుకమ్మ ఎత్తుకుంటూ వేడుకల్లో పాల్గొనేవారు. దీంతో తెలంగాణ పండుగగా బతుకమ్మ మరింత ప్రాచుర్యం లభించింది. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయింది. ఇటీవల జైలు నుంచి కవిత తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆమె బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారా? అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే బతుకమ్మ మొదలై మూడు రోజులైంది.