హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 05: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్‌ను రెండు రోజులపాటు నిర్వహించాలని తెలంగాణ విద్యా శాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటి వరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే గంటన్నర సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా తర్వాత టెన్త్ పేపర్లను 11 నుంచి 6 కు కుదించారు.