మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ..!!

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 05: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని రైతులు అధైర్య పడొద్దని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రూ.25 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం మరో 25 వేల కోట్లు రైతుల ఖాతాలోకి రావాల్సినవి ఉన్నాయి.

మరో 20 లక్షల మంది రైతులకు త్వరలో రైతు రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రుణ మాఫీ పూర్తి చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. అలాగే, భారతదేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల తెలిపారు. మన రాష్ట్రంలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నాం.

ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా సీఎం రేవంత్‌ రెడ్డి కష్టపడుతున్నాడని తెలిపారు. ఈ సీజన్లో రైతులు ఎక్కువగా సన్న ధాన్యాన్ని పండించారు.. రూ.500 అదనంగా ఇచ్చి సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. భవిష్యత్‌ లో కాంగ్రెస్‌ కు మంచి భవిష్యత్‌ ఉండాలనే మహేష్‌ కు పీసీసీ పదవి ఇచ్చింది.. రాష్ట్రంలో ఈ సీజన్‌ లో కోటి 43 లక్షల టన్నుల ధాన్యం పండుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పుకొచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment