ఆన్లైన్ బెట్టింగు అప్పులు ఎక్కువై సుమారు 18 లక్షల అప్పులతో మోయలేని భారంతో నలుగురిలో తిరగలేక..
ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో అప్పుల బాధ భరించలేక సురేష్ కుటుంబం ఆత్మహత్య..
సురేష్ తో పాటు అతని భార్య, కుమారుడు ముగ్గురు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య..
కొడుకుతో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య…
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/అక్టోబర్ 05: అన్యోన్యంగా సాగుతున్నా ఓ కుటుంబం కుమారుడు ఆన్లైన్ బెట్టింగు అప్పులు ఎక్కువై సుమారు 18 లక్షల అప్పులతో మోయలేని భారంతో నలుగురిలో తిరగలేక శుక్రవారం రాత్రి ముగ్గురు కుటుంబ సభ్యులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగనేని సురేష్ భార్య హేమలత కుమారుడు హరీష్ అన్యోన్యంగా సాగుతున్న కుటుంబం గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయంతో పాటు కిరాణా షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడా హరీష్ ఆన్లైన్ బెట్టింగ్లతో పాటు అప్పులు చేయడంతో ఎక్కువ మోతాదుల అప్పులు కావడంతో తల్లిదండ్రులు గతంలో 0.20 గుంటల భూమిని అమ్మి గతంలో అప్పులను చెల్లించారు. అయినా కుమారుడు తీరుమారక అప్పులు ఆన్లైన్ బెట్టింగ్లతో సుమారు 18 లక్షలు అప్పులు కావడంతో అప్పుల వారు ఆన్లైన్ వారి ఒత్తిడి కావడంతో నలుగురిలో తిరగలేక మనస్తాపం చెంది శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు వారి ఇంట్లో చీరల సహాయంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.