పింఛన్ల అవకతవకలకు ప్రభుత్వం అడ్డుకట్ట

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 సెప్టెంబర్: సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలకు జరగకుండా రిజిస్ట్రర్డ్ వేలిముద్ర స్కానర్లను ప్రభుత్వం తీసుకురానుంది. వీటి కొనుగోలుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం బుధవారం రూ.53.70 కోట్లు కేటాయించింది. వీటితో 1.34 లక్షల స్కానర్లు కొనుగోలు చేసి అక్టోబర్ నుంచి పింఛన్ల పంపిణీ కోసం వినియోగించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఎల్ జీరో ఆర్డీ డివైజ్‌లను పక్కన పెట్టనున్నారు. దీని ద్వారా నకిలీ వేలిముద్రలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment