హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/03 సెప్టెంబర్: ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పిందని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని విశ్రాంత ఇంజినీర్, ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు తెలిపారు. బోట్లు ఢీకొట్టడంతో దెబ్బ తిన్న గేట్లను నిన్న రాత్రి ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత మరమ్మతు చేపడతామని, పనులు పూర్తయ్యేందుకు 15 రోజుల సమయం పడుతుందన్నారు