హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/02 సెప్టెంబర్: తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో నిన్న అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉ.8.30 నుంచి ఈరోజు ఉ.6 వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలో 25.43 సెం.మీ, నిజామాబాద్ తూంపల్లిలో 22.1 సెం.మీ, కామారెడ్డి గాంధారిలో 18.6 సెం.మీ, తాడ్వాయి, లింగంపేటలో 18 సెం.మీ వర్షపాతం నమోదైంది.