తెలంగాణ సర్పంచ్ ఎన్నికల తేదీ ఖరారు !!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/01 సెప్టెంబర్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల తేదీ ఖరారు అయినట్లే కనిపిస్తోంది. ఈ ఎన్నికలపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలియజేశారు.
నిన్న జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పార్థసారథి సమావేశం అయ్యారు. నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ల నమోదు కొనసాగుతుందని, ఈనెల 6వ తేదీన ముసాయిదా జాబితాను రిలీజ్ చేస్తామని తెలియజేశారు. కుల గణన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.