హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల ద్వారా కొత్తగా తొమ్మిది రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. తహసీల్దారు కార్యాలయాల్లో కాకుండా వివిధ ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. ప్రస్తుతం తహసీల్దార్లు నేరుగా జారీ చేస్తున్న పత్రాలను ప్రజలు ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల నుంచి పొందేలా చర్యలు చేపట్టారు. తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు ‘మీ సేవ ఆన్ బోర్డ్’లో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆదేశించింది.
*మీ సేవ ద్వారా పొందే పత్రాలు*
పౌరుల పేరు మార్పిడి
తరచూ జారీ చేసే ఆదాయం, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు..
స్థానికత నిర్ధారణ (లోకల్ క్యాండిడేట్)
స్టడీ గ్యాప్ సర్టిఫికెట్
మైనారిటీ ధ్రువీకరణ
క్రీమీలేయర్, నాన్ క్రీమీలేయర్
మార్కెట్ విలువ
ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు
ఆర్వోఆర్-1(బి) సర్టిఫైడ్ కాపీలు.̲