హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: గురుకులాల్లో ఆరోగ్యం భద్రమేనా!తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. అపరిశుభ్ర వాతావరణం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం, వాతావరణ మార్పులతో జ్వరాలు, వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రభుత్వమిచ్చే మెస్‌ఛార్జీలతో కనీస ప్రమాణాల మేరకు పౌష్టికాహారం పెట్టే పరిస్థితి లేకుండాపోతోంది. చాలామంది విద్యార్థుల్లో రక్తహీనత సమస్య తలెత్తుతోంది. అధికారుల పర్యవేక్షణ కరువవుతోంది.